అది ఒక తరగతి గది..
మాస్టారు గదిలో అడుగు పెట్టగానే ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్..
మాస్టారు: ఈ రోజు మీకు పాఠం కంటే ముందు ఒక విషయం చెప్పాల్రా!
పిల్లలు: ఏంటండీ అది?
మాస్టారు: నా కవిత ఒకటి ఇవాళ్టి పేపర్లో పడిందిరా..
ఓ అల్లరి గడుగ్గాయి(ఓ.అ.గ.): అయ్యో పాపం, దెబ్బలేమైనా తగిలాయా సార్?

మాస్టారు: నీ మొహం మండా, పేపర్లో పడటం అంటే, కవిత ప్రచురించారు అని అర్థం రా తిక్క వెధవా...
ఓ.అ.గ.: అవునా, ఐతే నేను కూడా ఒక కవిత రాసి పంపిస్తానండి, ఎలా రాయలో చెప్పండీ!
మాస్టారు: ముందుగా ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి, ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూసుకొని..
ఓ.అ.గ.: ఆ చూసుకొని?
మాస్టారు: అప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ..
ఓ.అ.గ.: ఆ చూస్తూ..
మాస్టారు: వచ్చే ఆలొచనలని కాగితం మీద పెట్టు, కాని ప్రాస ఉండాలిరా, అదే కవిత..
ఓ.అ.గ(మనసులో): ఓహొ, ఇంత సులభమా..సరే ఇవాళ సాయంత్రమే మన ఊరి చివర ఉన్న కొండ దగ్గరికి వెళ్ళి, కవిత రాసేస్తా, నా తఢాకా చూపిస్తా...
(మరుసటి రోజు)
మళ్ళీ మాస్టారు గదిలో అడుగు పెట్టగానే ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్..
ఓ.అ.గ.: సార్, నేను ఒక కవిత రాసాను సార్..
మాస్టారు: ఏంటి అప్పుడే?
ఓ.అ.గ(గోముగా).: అవును సార్, మీరు వినాలి!
మాస్టారు: సరే చదవరా..
ఓ.అ.గ.(గొంతు సవరించుకొని):
అదిగదిగో కొండ..
అదిగదిగో కొండ..
కొండ మీద బండ..
బండ మీద కుండ..
కుండలోన తొండ..
ఎగిరింది తొండ..
పడింది బండ..
పగిలింది కుండ..
మాస్టారు: ఆపరా నీ ము**... #$%@*
(ఆయన ఏం తిట్టారో మీకు అర్థం అయ్యిందిగా..)(ఈ నాటకం మాతో వేయించాలని, 10 క్లాస్లో మా సంస్కృతం సార్ ప్రయత్నించారు, కాని కుదరలేదు, కాని ఈ కవిత మాత్రం నాకు బాగా గుర్తుండిపోయింది.. :-))
:-)))
ReplyDeleteKevvvvvvv
ReplyDeleteవేణూశ్రీకాంత్ గారూ, రాజ్ కుమార్ గారూ థాంక్యూ.. :-)
ReplyDelete