కొన్ని రోజుల క్రితం..అంటే నేనింకా కూడలి చూస్తూ మాత్రమే ఉన్న రోజుల్లో..అవ్వారు పార్వతి గారి బ్లాగ్ లో "వాల్ హ్యంగింగ్" అనే టపా చూసా..
స్వతహాగా ఇలాంటి పేపర్ క్రాఫ్ట్ లు చూడగానే చేసేయకపొతే నా చేతులు అస్సలు ఊరుకోవు, ఇంకేముందీ వెంటనే బజారుకు పరిగెత్తుకెళ్ళి కావలసినవి తెచ్చేసుకొని మొదలు పెట్టేసా..
మాములుగా అయితే నేనూ, నా రూమేరా(రూo మేట్ రాకాసి-స్వాతి) కలిసి ఏదయినా ఇలాంటిది మొదలు పెట్టామంటే అది చిరిగి చాటంతయి చాపంత అవుతుంది, కాని ఆ రోజు నా అదృష్టం బాగుండి అది ఊరికి వెళ్ళింది, సరే కదా అని నేను చేసేశా... ఆ "వాల్ హ్యంగింగ్"తో పాటు మిగిలిన అన్ని క్రాఫ్ట్ టపాలు చూసేసి అవి కూడా చేసేసి ఇలా గోడకు అంటించా...
ఆ తర్వాత మా రూమేరా వచ్చి చూసి, తను లేకుండా నేను ఇంత మహత్కార్యం చేయడం జీర్ణించుకోలేక, కుళ్ళుతో, నా వాల్ హ్యాంగింగ్ ఏమీ బాగా లేదు, మరీ చప్పగా(దాని బాషలో సింపుల్ గా) ఉంది, ఇంకోటి చేద్దాం అంది..నేను కూడా అవునేమో అనుకొని, సరే సరే అన్నా...
కాని అప్పటికే తెచ్చిన సరుకంతా(అంటే పేపేర్లూ, కలర్లూ) అయిపోయింది అని, మళ్ళీ బజారుకు పరుగెట్టి నేను తెచ్చిన కలర్ కాకుండా, వేరే కలర్ పేపర్ లు, ఇంకా రంగులూ, చెంకీలూ, ఇలా ఏవేవో అన్నీ తెచ్చేసి, మళ్ళీ మొదలు పెట్టాం... ఇలా.......
![]() |
పూబాలలు |
![]() |
మెరుగులు దిద్దుకుంటున్న నక్షత్రాలు |
మేము వాడిన వస్తువులు...
చివరగా అది ఇలా తయారు అయ్యింది...
అంతా అయిపోయాక చూస్తే, కాస్త ఏదోలా అనిపించింది.. :)
మీరే చెప్పండి, ఈ రెండిట్లో ఏది బాగుందో..(నేను చేసిందే బాగుందని మా రూమేరా అంటోంది మరి..)
నాకైతే రెండూ బాగున్నాయి. ఒకదాని దగ్గిర ఒకటి కాకుండా వేరే వేరే దూరంగా ఉంచండి. చాలా బాగుంటుంది:) Very nice work.
ReplyDeleteఅవునా..ధన్యవాదాలండి.. :)
ReplyDeleteనేను మొదట చేసింది ఇక్కడ మా రూం లో ఉంచాం, స్వాతి చేసింది వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది..
మీరు చేసింది పాత సినిమా పాటలా ఉంటే రెండోది దానికి రీమిక్స్ వర్షన్ లా ఉందండీ :-) జయగారన్నట్లు దేనందం దానిదే రెండూ బాగున్నాయ్ :-)
ReplyDeleteరెండూ బావున్నాయి..
ReplyDelete@వేణూశ్రీకాంత్ గారు: :-)
ReplyDeleteNaaku meeru chesinade baagundi
ReplyDelete@జ్యోతి గారు: ధన్యవాదాలండి.. :)
ReplyDelete:)
ReplyDeleteThank you Sarada...:)
ReplyDeleteSuper.
ReplyDeletenenu ninna comment pettitini, emaipoyindandi?? naaku meeru chesinade nachchindi ;)
ReplyDeleteథాంక్యూ రాజ్ గారు..నాకు ఎప్పుడో తెలుసు నాది కొంచం ఎక్కువ బాగుందని.. ;-)
ReplyDeleteథాంక్యూ లక్ష్మి గారు..
ReplyDeleteనిరంతరమూ వసంతములే గారు, రహ్మానుద్దీన్ షేక్ గారు: థాంక్యూ :)
ReplyDelete