అనుకోని ప్రయాణం .. అందమైన పరిణామం..
ఈ అనుకోని ప్రయాణంలో నా అనుభవాలు..
మార్చ్ 29, ఉదయం 11:00
ఎప్పటిలాగానే కూడలి చూస్తుండగా '
జీవని’ బ్లాగ్ లో
'చాలా రోజుల తర్వాత జీవనికి వస్తున్న బ్లాగర్లు... అందరికీ ఆహ్వానం' అన్న శీర్షిక చూసి నన్నే పిలిచేసినంత ఆనందం వేసింది. ఎలాగూ వారాంతమే కదా అని వెళ్ళాలని అనుకున్నా. అనుకోవడమైతే అనుకున్నా కాని మళ్ళీ ఏదో సంకోచం..వచ్చే వాళ్ళందరి బ్లాగులు నేను చదువుతాను కానీ, వాళ్ళెవరికీ నేను తెలియను కదా అనిపించింది.. అదేదో సినిమాలో చెప్పినట్టు 'నాకు చంద్రబాబునాయుడు బాగా తెలుసు కానీ నేనే ఆయనకు తెలీదు’ అన్నాట్ట ఎవడో నాలాంటి వాడే... ఐనా ఎందుకో బాగా బలంగా అనిపించింది వెళ్ళాలి అని, అంతే వెంటనే ప్రసాద్ గారికి ఫోన్ చేసాను, 'నేను ఫలానా అండి, రేపు జీవనికి వద్దామని అనుకుంటున్నాము' అని చెప్పాను, ఆయన వెంటనే 'వచ్చేయండి’ అనేసారు.
వెంటనే కాబోయే శ్రీవారికి(ఆనంద్) ఫోన్ చేసి అడిగా 'మనం రేపు అనంతపురం వెళ్దామా' అని, ఎప్పటిలాగానే 'నీ ఇష్టం' అనేసారు, ఇలా అంటాడని ముందే తెలిసినా, ఒకసారి అడగాలి కదా, మన వైపు నించి ఏ తప్పూ ఉండకూడదు కదా మరి.. ;-)
వెంటనే ఇంకో ఆలోచన, పిల్లలకి ఏమి తీసుకొని వెళ్ళాలి అని .. సాయంత్రం వరకూ అలోచించినా కూడా ఏమీ తట్టలేదు!
మార్చ్ 29, సాయంత్రం 7:00
పోనీ ఒకసారి అలా బయటకు వెళ్తే ఏమైన ఆలోచన వస్తుందేమోనని వెళ్ళా, 1 గంట తిరిగాను కాని ఏమి తీసుకెళ్ళాలొ తెలియలేదు...సరె అని తిరిగి ఇంటికి వచ్చేస్తుంటే అప్పుడు కనపడ్డాయి ఒక షాప్ లో బయట తగిలించిన రంగు పిచికారిలు..

వెంటనే గుర్తు వచ్చింది మొన్ననేగా హోలి ఐపొయింది అని..
వెంటనే ప్రసాద్ గారికి ఫొన్ చేసి అడిగాను 'హోలి చేసారా జీవనిలో' అని,
ఆయన 'లేదండి' అన్నారు...
ఇంకేం అలోచన వచ్చిందే తడవు అడిగేశా 'నేను తీసుకురానా రంగులు' అని
'తప్పకుండా' అన్నారాయన.
వెంటనే ఆ షాపులోకి వెళ్ళి ఆ పిచికారిలను పట్టుకొని అడిగా
'ఎన్ని ఉన్నాయి?'
ఆ షాపులో అబ్బాయి లెక్కపెట్టి '15' అని చెప్పాడు.
అయ్యో అన్నేనా అనిపించింది, ఇంక ఎంత వెతికినా దొరకలేదు..
'రంగులు?' అని అడిగితే
'లేవు' అనేసాడు...
ఇక ఆ తర్వాత కనిపించిన అన్ని షాపులూ తిరిగితే ఒక చోట మాత్రం 3 రంగులు దొరికాయి..ఏవో ఒకటిలే అని తీసుకుంటుంటే ఓ బుడ్డాడు అప్పుడే వాళ్ళ నాన్నతో కలిసి ఆ షాప్ కి వచ్చాడు, నా చేతిలో రంగులు చూసి 'హోలి ఐపోయాక ఈ అక్క రంగులు కొంటుదేం?' అని అడిగాడు.. :((( వాళ్ళ నాన్న ఏమో నా వైపు చూసి 'హి హి హి' అని నవ్వి వెళ్ళిపొయాడు.. :( ఐనా కానీ నేనేమీ ఏడవలేదు.... :)
మార్చ్ 30, ఉదయం 4:30
అలారం దెబ్బకి లేచేసి, ఆనంద్ కి wake up call చేసేసి, త్వరత్వరగా తయారయి, బస్ స్టాండ్ కి వెల్లి అనంతపురం బస్ ఎక్కేసాం.
బస్ ఎక్కినప్పటినించి ఒకటే ఆలోచనలు, అక్కడ అందరూ ఎలా ఉంటారో, అసలు నన్ను పలకరిస్తారా, నాతో మాట్లడతారా, అని!
ఇలా అలోచనల్లో వుండగానే వచ్చేసింది అనంతపురం. పెద్దగా కష్టపడకుండానే జీవని చేరుకున్నాం, ప్రసాద్ గారి సాయంతో.
మేము వెళ్ళేసరికి, రెహ్మాన్ గారు నిద్రపోతున్నారు. లేచాక పరిచయాలు అయ్యేసరికి, రాజ్ గారు, కార్తీక్ గారు, భాస్కర్ గారు వచ్చారు, మళ్ళీ అందరి పరిచయం. చాలా త్వరగా కలిసిపొయారు అందరూ..
నాకేమో వీళ్ళందరూ పెద్ద పెద్ద celebrities లాగా అనిపిస్తున్నారు, ఆనంద్ ఏమో మాములుగా మాట్లాడేస్తున్నాడు..తను అసలు బ్లాగ్స్ ఫాలో అవ్వడు, వీళ్ళందరి బ్లాగ్స్ గురించి, వీళ్ళ టపాల గురించి, వీళ్ళ పంచ్ డయిలాగుల గురించి తెలిసిన నేను కాసేపు ఏం మాట్లడాలో తెలియక తికమక పడ్డాను, కాసేపే.. :)
తర్వాత జరిగినవి
ఇక్కడ,
ఇక్కడ, లేక
ఇక్కడ చదవండి..ANR దేవదాసుని కృష్ణ మళ్ళీ తీసినట్టు వుంటుందని రాయడం లేదు (ఇది
పచ్చల లక్ష్మీ నరేష్ గారి డయిలాగ్, వారి నుండి అనుమతి తీసుకోకుండా తస్కరించటం జరిగింది. ;-) )
మరుసటి రోజు ప్రయాణం ఇంకో టపాలో ...