వైణిక
Tuesday, 29 July 2014
Wednesday, 23 July 2014
Tuesday, 22 July 2014
Thursday, 17 April 2014
Missing You Chinnu... :(
నిన్నటివరకు:
"చిన్నూ, ఐస్ క్రీం"
"ఏయ్ చిన్నీ, కొడతా, మళ్ళీ ఐస్ క్రీమా? మొన్నే కదా జలుబూ, జ్వరం తగ్గింది, ఇప్పుడు మళ్ళీ! అసలు భయం లేకుండా పోయింది నేనంటే!"
"భయం ఎందుకు? ప్రేముందిగా!"
"అది కాదు బుజ్జి తల్లీ, ఐస్ క్రీం వద్దులే ఈసారికి"
"పో, నీకసలు నేనంటే ప్రేమే లేదు!" :(
"అది కాదురా"
"ఏం అక్కర్లేదు"
"సరేలే, రా కొనిపెడతా,M.T.R? ibaco?"
"కాదు"
"మరి?"
"ice gola"
"చీ, ఆ పుల్లకి ఐస్ పెట్టి రంగు నీళ్ళు చల్లి అమ్మేస్తారు, not healthy!"
"కానీ నాకు అదే కావాలి!"
"సర్లే పద తల్లీ"
"అదీ, అలా రా దారికి" :)
ఇవాళ:
దారిలోనే ico gola ఉంది, కానీ వద్దనడానికి చిన్ను లేడు, తినాలనే ఆశ కూడా లేదు!
నీతో ఉన్నప్పుడు అందంగా కనపడిన అన్నీ, నువ్వు లేకపొయేసరికి భారంగా కనపడుతున్నాయి..
ఇంకా 2 నెలలు.. 60 రోజులు...ఇలానే..హ్మ్
Missing You Chinnu... :(
"చిన్నూ, ఐస్ క్రీం"
"ఏయ్ చిన్నీ, కొడతా, మళ్ళీ ఐస్ క్రీమా? మొన్నే కదా జలుబూ, జ్వరం తగ్గింది, ఇప్పుడు మళ్ళీ! అసలు భయం లేకుండా పోయింది నేనంటే!"
"భయం ఎందుకు? ప్రేముందిగా!"
"అది కాదు బుజ్జి తల్లీ, ఐస్ క్రీం వద్దులే ఈసారికి"
"పో, నీకసలు నేనంటే ప్రేమే లేదు!" :(
"అది కాదురా"
"ఏం అక్కర్లేదు"
"సరేలే, రా కొనిపెడతా,M.T.R? ibaco?"
"కాదు"
"మరి?"
"ice gola"
"చీ, ఆ పుల్లకి ఐస్ పెట్టి రంగు నీళ్ళు చల్లి అమ్మేస్తారు, not healthy!"
"కానీ నాకు అదే కావాలి!"
"సర్లే పద తల్లీ"
"అదీ, అలా రా దారికి" :)
ఇవాళ:
దారిలోనే ico gola ఉంది, కానీ వద్దనడానికి చిన్ను లేడు, తినాలనే ఆశ కూడా లేదు!
నీతో ఉన్నప్పుడు అందంగా కనపడిన అన్నీ, నువ్వు లేకపొయేసరికి భారంగా కనపడుతున్నాయి..
ఇంకా 2 నెలలు.. 60 రోజులు...ఇలానే..హ్మ్
Missing You Chinnu... :(
Saturday, 22 March 2014
శివ! గంగా! ఒక నందన్నయ్య!
శివ! గంగా! ఒక నందన్నయ్య!
శివుడి తలపైన గంగమ్మ ఉందా? అంటే ఔను అనే చెప్పాలి శివుడు 4488.19 అడుగులు ఉండి ఉంటాడు అక్కడ గంగమ్మ కింద దాకా వెళ్లాలేక తలపైన ఆగి పొయ్యి నందీస్వరుడు కూడా గంగమ్మకి అక్కడే కాపలకి ఉండిపొయ్యినట్లుగా ఉంది శివగంగా!శివగంగా అనే పేరు చూడగానే ఆ రోజు ఎక్కడికెక్కడికో వెళదాం అనుకుని కూడా ఆ కొండ మీద నందిని చూసి ఆకాశాన్ని ఒక్కసారి ముట్టుకుని ఆర్మ్‌స్ట్రాంగ్ పక్కన రాసుకోవచ్చు అనే స్వార్దపూరితా ఆలోచన శివగంగా వైపు నడిపించింది, అది ఎలాగంటే......
ఉదయాన్నే పళ్ళు కూడా తోముకోకుండా చీకట్లో చలిలో బైకుల మీద హెల్మెట్లు పెట్టుకుని ఔన్సు గాలి కూడా లోపలికి పోకుండా నిండుగా కప్పుకుని బయలుదేరాలి అని రాత్రంతా ఆలోచించి ఆలోచించి ఉదయం లేచేసరికి కొంచెం ఆలస్యమై పట్టపగలు పదింటికి మా ప్రయాణం మొదలుపెట్టాం .
దూరం తెలుసు కానీ దారి తెలీదు.. కొండ ఉందని తెలుసు కానీ కండలు కరుగుతాయని తెలీదు.. ఐనా ప్రయాణం అలాగే మొదలుపెట్టాం, ప్రయాణం మొదలైన ఒక రెండు గంటలకే అంటే మిట్ట మద్యాహ్నం 12 గంటలకి శివగంగా చేరుకున్నాం !
ఎడారిలో ఓయాసిస్ లాగా అప్పటిదాకా దారిలో ఏ ఊరు కనపడకపోయినా శివగంగా లో చాలానే ఇళ్లున్నాయ్, చివరికి బైకులని పార్క్ చేశాం..
హమ్మయ్య వచ్చేసాం అనుకునే లోపే శివుడి గుడికి ద్వారమార్గం తప్ప ఎం కనపడక అయ్యయ్యో ఎందుకు వచ్చాం అనుకున్నాం.
అక్కడ అందంగా ధృడంగా ఉన్న 65 ఏళ్ల తాత మా చెప్పులు అక్కడ వదిలిపెట్టె దాకా తన వాక్చాతు ర్యాన్ని, ఆయన ఉదార స్వభావాన్ని, అర్ధరహితమైన భావజాలాన్ని మాపై రుద్ది రుద్ది ఆయన అనుకున్న లక్ష్యం సాధించాడు. ఇక్కడ గుడేకదా చూసి వెళ్లిపోదామని మేము ఆయన కోరిక తీర్చాం
పాదరక్షకవచాలు కర్ణుడి కవచకుండలాలు దానం చేసినంత కష్టంగా ఆ తాతన్నయ్య కి సమర్పించి లోపలికి నడవడం ప్రారంభించాం ...
కొద్ది దూరం నడిచాక గుడి మొదలుభాగాన్నే రెండు దార్లు ఒకటి రహదారి రెండోది అడ్డదారి . అందరు దగ్గరగా ఉంది గుడి అని అడ్డదారి లో వెళ్ళడం చూసి మా దారి రహదారి అని ఎడమవైపుకి మళ్ళాం.. వేసే మొదటి అడుగు చుట్టూ యాభై కోతులు వెయ్యాల్సిన అడుగు వేసేశాం .....
మొదట నందన్నయ్య కొండదారి కొంచం బాగానే వుంది, బాగుంది కదా అని అడుగడుగుకీ జగదేక వీరులులాగా ఏదో సాధిస్తున్నాం అన్న భావంతో మనమే ఎక్కుతున్నాం అన్న గర్వంతో అద్భుతః అనిపించే విధంగా చాయాచిత్రాలకి భంగిమలు ఇచ్చుకుంటూ వెళ్ళాం. ఇక మొదలైంది కడుపులో కిచకిచలాట..ఒక పక్క ఆకలి, ఒక పక్క ఎండ, ఇంకోపక్క కొండ..మీకొసమే మేము అన్న విధంగా మధ్య మధ్యలో తిండి దుకాణాలు, పర్యాటకుల సౌకర్యం కోసం, అక్కడి వారి జీవనోపాధి కోసం, అన్నీ కొంచం విదేశీ ధరలకే విక్రయిస్తున్నా ప్రాణం కన్నా పణం(డబ్బు) ఎక్కువ కాదు కద సుమీ! అని అన్నాడో మహా కవి!!
మా రహదారి |
మనిషికి ఒక కోతి చొప్పున కాపలా పెట్టాడు నందీశ్వరుడు..వాటిని బెదిరించలేం, అలా అని పారిపొలేం..వాటితొటి కలిసిపోయి, వాటి లాగా కొండ ఎక్కడమే శరణ్యం.
కొండ మీద కోతులివే |
ఎలాగైతేనేం 3 గంటలకి కొండ ఎక్కాం ..ఆ నంది ని చెక్కిన వాడి ఇల్లు ఆకాశంలో ఏ వూరో అన్నట్టుగా ఉంది ఆ ప్రదేశం.
మాతో నందన్నయ్య |
అక్కడినుండి చూస్తే ఎవరైనా అలా అనాల్సిందే.. కిందకి చూస్తూ ఎవరైనా హాయిగా పైకి పోవచ్చు. అలా ఉందక్కడ..
మొత్తానికి కాలాతీతం కాకముందే కొండ దిగుడు మొదలెట్టాం..ఐపొయిందిలే అనుకుంటున్న సమయంలో ఒక 100మంది అప్పుడు పైకి ఎక్కడం గమనించి 'అబ్బో' అనుకున్నాం..అన్నట్టు రాత్రి అక్కడే ఉండి నిప్పు నృత్యం(FireCamp) చేస్తారంట.. ;-)
దిగుతున్న దారిలో ఒక శివుడి గుడి..ఆ గుడి దగ్గర జనాలు విపరీతంగా ఉంటే ఏంటో అనుకొని లోపలికి వెళ్ళాం..గుహ, గుహలో గుడి, గుడిలో శివుడు, గుడివెనుక గంగ..ఆ గంగ నీరు బిందెలో చేయి పెట్టినట్టుగా ఒక నుయ్యి లో చేయి పెట్టాలి. ఆశ్చ్యర్యం!అదృష్టం ఉన్నవారికి మాత్రమే ఆ నీరు అందుతాయని నమ్మకం అట..
అదృష్టబావి ఇదే |
అందరూ ప్రయత్నిస్తున్నారు, ఎవరికీ అందటంలేదు. విషయం తెలీక సరదాగా చెయ్యి చెయ్యెడదాం అని పెడితే చేతి నిండా నీళ్ళు, ఎన్ని సార్లు పెట్టినా అందుతున్నాయ్..పక్కన ఎవరు పెట్టినా అందడం లేదు, ఒక్కసారిగా అందరూ ఖలేజా లో మహేష్ ని చూసినట్టు చూసారు!! అందరిపైనా నీళ్ళు చల్లేసి, వాళ్ళు ఫోటోగ్రాఫులు, ఆటోగ్రాఫులూ అడగకముందే అక్కడి నుండి బయటికి వచ్చాం. విషయం తెలీదు కాని ఆనందం మాత్రం ఆపుకొలేకపోయాం. అదే ఆనందం తో కాళ్ళకి బొబ్బలు వచ్చాయి అన్న విషయం కూడా మర్చిపోయాం..
అనంత పద్మనాభాసనం |
అదృష్టం ఏంటంటే ఎక్కేటప్పుడు పడ్డ కష్టం అక్కడికి వెళ్ళి చుసిన ఆనందం వల్ల అనుకుంటా దిగెటప్పుడు తెలీలేదు. ఎలా ఐతేనేం కొండ దిగాం, ఆ తాతన్నయ్య ని చూసి చెప్పులు లెకుండా చెసినందుకు కోపం వచ్చినా మనం దేవుళ్ళం అనుకొని అతన్ని క్షమించేసి పాదరక్షలు ధరించి పక్కనె ఉన్న చేపల కొలనులొకి వెళ్ళాం.
జిల్ జిల్ జిల్.. |
ఆ కొలను పాత కాలం కొలను లాగా ఉన్నా, నీళ్ళూ చేపలు మాత్రం కావలసినన్ని ఉన్నాయ్. అవి ఆకలితో ఉన్నట్టున్నాయ్, అందరం మా కాళ్ళని కాసేపు వాటికి ఆహారంగా వేసి, సేద తీర్చుకొని మళ్ళీ ఇంటికి బయలుదేరాం.
అప్పటికే 5:30 అయ్యింది.
ఇంకోసారి ఆ నందిని చెక్కిన ఆ శిల్పికి సలాం కొడుతూ, రోజు అంతపైకి ఎక్కి జీవనోపాధి సాగిస్తున్న వారందరికీ సెల్యుట్ చేస్తూ సూపర్ శివగంగా అనుకొని ఇంటికి వెళ్ళాం.
శివగంగః! అత్యద్భుతః!! శివోనమః!!!
Thursday, 11 July 2013
Friday, 3 May 2013
ఆపరా నీ...........
అది ఒక తరగతి గది..
మాస్టారు గదిలో అడుగు పెట్టగానే ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్..
మాస్టారు: ఈ రోజు మీకు పాఠం కంటే ముందు ఒక విషయం చెప్పాల్రా!
పిల్లలు: ఏంటండీ అది?
మాస్టారు: నా కవిత ఒకటి ఇవాళ్టి పేపర్లో పడిందిరా..
ఓ అల్లరి గడుగ్గాయి(ఓ.అ.గ.): అయ్యో పాపం, దెబ్బలేమైనా తగిలాయా సార్?
మాస్టారు: నీ మొహం మండా, పేపర్లో పడటం అంటే, కవిత ప్రచురించారు అని అర్థం రా తిక్క వెధవా...
ఓ.అ.గ.: అవునా, ఐతే నేను కూడా ఒక కవిత రాసి పంపిస్తానండి, ఎలా రాయలో చెప్పండీ!
మాస్టారు: ముందుగా ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి, ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూసుకొని..
ఓ.అ.గ.: ఆ చూసుకొని?
మాస్టారు: అప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ..
ఓ.అ.గ.: ఆ చూస్తూ..
మాస్టారు: వచ్చే ఆలొచనలని కాగితం మీద పెట్టు, కాని ప్రాస ఉండాలిరా, అదే కవిత..
ఓ.అ.గ(మనసులో): ఓహొ, ఇంత సులభమా..సరే ఇవాళ సాయంత్రమే మన ఊరి చివర ఉన్న కొండ దగ్గరికి వెళ్ళి, కవిత రాసేస్తా, నా తఢాకా చూపిస్తా...
(మరుసటి రోజు)
మళ్ళీ మాస్టారు గదిలో అడుగు పెట్టగానే ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్..
ఓ.అ.గ.: సార్, నేను ఒక కవిత రాసాను సార్..
మాస్టారు: ఏంటి అప్పుడే?
ఓ.అ.గ(గోముగా).: అవును సార్, మీరు వినాలి!
మాస్టారు: సరే చదవరా..
ఓ.అ.గ.(గొంతు సవరించుకొని):
అదిగదిగో కొండ..
అదిగదిగో కొండ..
కొండ మీద బండ..
బండ మీద కుండ..
కుండలోన తొండ..
ఎగిరింది తొండ..
పడింది బండ..
పగిలింది కుండ..
మాస్టారు: ఆపరా నీ ము**... #$%@*
(ఆయన ఏం తిట్టారో మీకు అర్థం అయ్యిందిగా..)(ఈ నాటకం మాతో వేయించాలని, 10 క్లాస్లో మా సంస్కృతం సార్ ప్రయత్నించారు, కాని కుదరలేదు, కాని ఈ కవిత మాత్రం నాకు బాగా గుర్తుండిపోయింది.. :-))
Subscribe to:
Posts (Atom)